గ్లోబల్ సౌత్‌కు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ పిలుపు.
రిపోర్టర్: సతీష్
స్థలం: India
గ్లోబల్ సౌత్ దేశాలకు నిర్ణయాల్లో తగిన ప్రాధాన్యత దక్కాలని బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రపంచ పాలనా వ్యవస్థ అధికార కేంద్రీకరణతో కూడిన పిరమిడ్‌లా ఉందని, దానిని భాగస్వామ్య వేదికగా మార్చాలని పిలుపునిచ్చారు. ప్రపంచ పాలనా సంస్కరణల కోసం పది అంశాల రోడ్‌మ్యాప్‌ను ఆయన ప్రతిపాదించారు.