వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో సమన్వయంతో సాగాలి.. డీఎస్పీ మధుసూదన్ రెడ్డి పిలుపు!
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో వలిగొండ రోడ్డులోని ఎస్ఎం రెడ్డి గార్డెన్స్‌లో గురువారం పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. డీఎస్పీ పి. మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇన్స్పెక్టర్ జి. మన్మధకుమార్, సర్పంచులు, కౌన్సిలర్లు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. విగ్రహాల ప్రతిష్ఠాపన, శాంతిభద్రతలు, ట్రాఫిక్, విద్యుత్ భద్రతపై చర్చించారు. నిబంధనలు పాటిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వేడుకలు జరుపుకోవాలని, పోలీసులకు అందరూ సహకరించాలని అధికారులు కోరారు.