రాజ్‌పాల్ యాదవ్‌కు సుప్రీంకోర్టులో ఊరట, రూ. 5 కోట్లు చెల్లించాలని ఆదేశం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: న్యూఢిల్లీ
ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. చెక్ బౌన్స్ కేసులో కోర్టులో రూ. 5 కోట్లు డిపాజిట్ చేయాలనే షరతుతో లొంగిపోకుండా ధర్మాసనం మినహాయింపునిచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన జైలు శిక్షను సవాల్ చేస్తూ రాజ్‌పాల్ యాదవ్, ఆయన సతీమణి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు, తదుపరి విచారణను సెప్టెంబర్ 15కి వాయిదా వేసింది.