ఆన్‌లైన్ గేమ్‌ల మోసాలతో యువత బలి కోస్గిలో సైబర్‌ నేరాల కలకలం

రిపోర్టర్: అశోక్ స్థలం: కోస్గి

కోస్గి పట్టణంలో ఆన్‌లైన్ గేమ్‌ల మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయంటూ సైబర్ నేరగాళ్లు యువతను ఆకర్షించి నగదు కాజేస్తున్నారు. కోస్గికి చెందిన ఓ యువకుడు ఆన్‌లైన్ గేమ్‌లో రూ.50 వేలు పోగొట్టుకోగా, మరికొందరి ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయి. ఈజీమనీకి అలవాటుపడి యువత సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దని, సైబర్‌ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబరుకు ఫిర్యాదు చేయాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.