అన్ బిల్ అవాన్ సినిమా కోసం తల్లిదండ్రుల ఇల్లు తాకట్టు పెట్టిన అశోక్ సెల్వన్
రిపోర్టర్: కిరణ్
స్థలం: చెన్నై
కోలీవుడ్ నటుడు అశోక్ సెల్వన్ తాను నటిస్తూ నిర్మిస్తున్న రొమాంటిక్ డ్రామా అన్ బిల్ అవాన్ చిత్రం కోసం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెన్నైలో జరిగిన ప్రీ-రిలీజ్ వేడుకలో వెల్లడించారు. సినిమా బడ్జెట్ అంచనాలను మించిపోవడంతో తన తల్లిదండ్రుల ఇల్లును తాకట్టు పెట్టాల్సి వచ్చిందని, అయినప్పటికీ తన తల్లిదండ్రులు తన కల కోసం గట్టిగా నిలబడ్డారని ఆయన భావోద్వేగంగా తెలిపారు. రెండేళ్ళ తర్వాత ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం తనకు కొత్త ఆరంభం అని ఆయన పేర్కొన్నారు.