గోవాలో మైనింగ్ మంత్రుల నాలుగో సదస్సు: కీలక సంస్కరణలపై చర్చించనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Hyderabad
గోవాలోని బెనౌలిమ్ వేదికగా జరగనున్న నాలుగో మైనింగ్ మంత్రుల సదస్సులో కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ప్రసంగించనున్నారు. దేశంలో మైనింగ్ మరియు బొగ్గు రంగానికి సంబంధించిన కీలక సంస్కరణలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం సందర్భంగా రంగం మరింత పటిష్టతకు దోహదపడే పలు నూతన కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు పేర్కొంటూ కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా వివరాలు పంచుకున్నారు.