కొత్త ఉద్యోగాల సృష్టే ప్రభుత్వ ఏకైక అజెండానన్న మంత్రి లోకేశ్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: దిల్లీ

పదేళ్ల పాటు ఒకే ప్రభుత్వం స్థిరంగా ఉంటే పేదరికం పూర్తిగా తొలగిపోతుందని ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. దిల్లీలో పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా ఫైర్ సైడ్ చాట్ లో పాల్గొన్న ఆయన, సాహసోపేత నిర్ణయాలతోనే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తోందని చెప్పారు. కొత్త ఉద్యోగాల సృష్టే తమ ప్రభుత్వ ఏకైక అజెండా అని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.