విశాఖలో మిషన్ జ్యోతిర్గమయ: నిరాశ్రయులకు ఉచితంగా నాణ్యమైన ఆహార వితరణ
రిపోర్టర్: గోపి
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం నగరంలో పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో చేపట్టిన మిషన్ జ్యోతిర్గమయ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఐదు కమ్యూనిటీ ఫ్రిజ్‌ల ద్వారా నిరాశ్రయులు మరియు ఆకలితో ఉన్న పేదలకు ప్రతిరోజూ ఉచితంగా ఆహారం అందిస్తున్నట్లు విశాఖ నగర పోలీసులు వెల్లడించారు. ఆహారం వృథా కాకుండా మిగిలిన భోజనాన్ని అవసరమైన వారికి చేరవేయాలనే లక్ష్యంతో ఈ వినూత్న సేవను నిరంతరం కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, దాతలు భాగస్వామ్యమై ఆహారాన్ని విరాళంగా అందించాలని కోరారు.