జన్నారంలో కనీస వసతులు లేక రోడ్డున పడ్డ చిరువ్యాపారుల గోడు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో చిరు వ్యాపారులు మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి కూరగాయలు విక్రయించడానికి వచ్చే వ్యాపారులు తాగునీరు, మూత్రశాలలు వంటి కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారి పక్కనే వ్యాపారాలు కొనసాగిస్తున్న తమకు అధికారులు ప్రత్యేక వసతులు కల్పించి ఆదుకోవాలని కోరారు.