సస్య గణపతిని దర్శించుకున్న ప్రముఖులు
రిపోర్టర్: RAMESH LAVETI
స్థలం: అనకాపల్లి
అనకాపల్లి జిల్లా చింతామణి గణపతి దత్త క్షేత్రంలో పదిహేను వేలకు పైగా మొక్కలతో అద్భుతంగా ఏర్పాటు చేసిన సస్య గణపతిని ఒరిస్సా గవర్నర్ కంభంపాటి హరిబాబు, మాజీ పార్లమెంట్ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, స్థానిక శాసన సభ్యులు కొణతాల రామకృష్ణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా క్షేత్ర నిర్వాహకులు వారికి ఘన స్వాగతం పలికారు. పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ఇస్తున్న ఈ సస్య గణపతి విశేషాలను వారు అడిగి తెలుసుకున్నారు.