జూబ్లీహిల్స్ ఘటన: బీఎండబ్ల్యూ యజమానిని బెదిరించి వసూళ్లకు పాల్పడిన నలుగురు అరెస్ట్

రిపోర్టర్: గోపి స్థలం: Hyderabad

హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో బీఎండబ్ల్యూ కారు యజమానిని బెదిరించి ఐదు వేల రూపాయలు డిమాండ్ చేసిన నలుగురు వ్యక్తులను నగర పోలీసులు అరెస్ట్ చేశారని ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కొరీనా సువారెస్ వెల్లడించారు. క్రాస్ డ్రెస్సింగ్ వేషధారణలో ఉన్న వ్యక్తులు నగరంలో కొత్త ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, శుభకార్యాలు మరియు కార్ల యజమానులను లక్ష్యంగా చేసుకుని నిరంతరం వేధింపులకు గురిచేస్తూ బలవంతంగా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లు మరియు స్థానికుల ద్వారా వీరికి సమాచారం అందుతోందని కొరీనా సువారెస్ పేర్కొన్నారు.