ఎంపీ నివాసంలో జరిగిన టీడీపీ నేతల ఆత్మీయ సమావేశం

రిపోర్టర్: GANESH BBL స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా, విజయనగరం లో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నివాసంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు పాల్గొన్నారు. నియోజకవర్గాల అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో నూరు శాతం విజయం సాధించాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున సహా పలువురు నేతలు పాల్గొన్నారు.