దానిమ్మ పండ్ల బాక్స్‌లో కరెన్సీ నోట్ల ముక్కలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
దానిమ్మ పండ్ల బాక్స్‌లో చిత్తు కాగితాలకు బదులుగా ఐదు వందలు, రెండు వందలు, వంద రూపాయల కరెన్సీ నోట్ల ముక్కలు ప్యాకింగ్‌గా రావడంతో ఓ పండ్ల వ్యాపారికి వింత అనుభవం ఎదురైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, కరెన్సీ నోట్లను ఇలా ప్యాకింగ్ మెటీరియల్‌గా ఎందుకు ఉపయోగించారనే చర్చ నెట్టింట జోరుగా సాగుతోంది.