ఏపీలో నేడు 22 కీలక ఆరోగ్య ప్రాజెక్టుల ప్రారంభం

రిపోర్టర్: సునీల్ స్థలం: అమరావతి

రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రూ.249.50 కోట్లతో పూర్తి చేసిన 22 కీలక ఆరోగ్య ప్రాజెక్టులను కేంద్ర మంత్రి జేపీ నడ్డా, సీఎం చంద్రబాబు శనివారం ప్రారంభించనున్నారు. విజయవాడలో క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ను ప్రత్యక్షంగా, ఇతర జిల్లాల ప్రాజెక్టులను వర్చువల్‌ విధానంలో ప్రారంభిస్తారని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. పీఎం-అభిమ్‌ కింద అత్యవసర చికిత్స కేంద్రాలు, ప్రజారోగ్య ప్రయోగశాలలు అందుబాటులోకి వస్తున్నాయి.