ఇకపై దేశవ్యాప్తంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం!

రిపోర్టర్: రమేష్ స్థలం: India

జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ వేడుకలపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా ఢిల్లీకే పరిమితమైన ఈ వేడుకను ఇకపై దేశంలోని వివిధ ప్రాంతాలలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకోగా, తొలిసారిగా 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవాన్ని సెప్టెంబర్ 22న గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నిర్వహించనున్నారు.