పుత్తూరులో సబ్ జైలు నిర్మాణానికి చర్యలు: హోంమంత్రిని కోరిన విజయబాబు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పుత్తూరు

పుత్తూరు పట్టణంలో సబ్ జైలు వెంటనే నిర్మించాలని హోం మంత్రి వంగలపూడి అనితను టీడీపీ నేత పోతుగుంట విజయబాబు కోరారు. గతంలో ఇచ్చిన వినతిపత్రాన్ని గుర్తు చేస్తూ, నందిమంగళం రెవెన్యూ పరిధిలో కేటాయించిన స్థలంలో నిలిచిపోయిన నిర్మాణ పనులను పూర్తి చేయాలని అమరావతిలో ఆమెను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.