చౌటుప్పల్ కేజీబీవీలో విద్యార్థినుల అవస్థలు: మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం
రిపోర్టర్: గోపి
స్థలం: యాదాద్రి భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లోని కస్తూర్బా గాంధీ పాఠశాలను మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారని అధికారులు తెలిపారు. పాఠశాలలో నాణ్యమైన భోజనం అందక, తాగునీరు లభించక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వసతి గదులు లేక బెంచీలపై నిద్రిస్తున్నామని బాలికలు వాపోవడంతో వార్డెన్ పై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు.