న్యూయార్క్ కంటే ముంబై మెట్రోనే చాలా బాగుంది: అమెరికన్ యువతి

రిపోర్టర్: రమేష్ స్థలం: ముంబై

ముంబై మెట్రో ప్రయాణంపై అమెరికన్ కంటెంట్ క్రియేటర్ లిజ్ ప్రశంసలు కురిపించారు. న్యూయార్క్ మెట్రోతో పోలిస్తే ముంబై మెట్రో ఎంతో శుభ్రంగా, సురక్షితంగా ఉందని ఆమె కొనియాడారు. తక్కువ ధర, ఏసీ సౌకర్యం మరియు మహిళల కోసం ప్రత్యేక బోగీలు ఉండటం అద్భుతమని పేర్కొన్నారు. 'అమెరికా భారత్ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి' అని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.