కర్నూలులో ఆపరేషన్ త్రిశూల్ ప్రారంభించిన కలెక్టర్ ఎస్పీ
రిపోర్టర్: గోపి
స్థలం: కర్నూలు
కర్నూలు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణ, మహిళా భద్రత మరియు రోడ్డు భద్రతను పెంపొందించే లక్ష్యంతో ప్రతిష్టాత్మక ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి మరియు ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గంజాయి సాగు, వినియోగం మరియు అక్రమ రవాణాను పూర్తిగా అణచివేయడానికి జీరో కల్టివేషన్ విధానాన్ని కఠినంగా అమలు చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.