మహ్మదాబాద్ పంచాయతీ భవన నిర్మాణానికై అధికారులను కోరిన సర్పంచ్

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మహమ్మదాబాద్ గ్రామపంచాయతీ నూతన భవనానికి వెంటనే స్థలం కేటాయించాలని సర్పంచ్ రామ టెంకి శంకర్ డిమాండ్ చేశారు. బుధవారం మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ చంద్రయ్యను కలిసి ఆయన వినతి పత్రం సమర్పించారు. పంచాయతీ ఏర్పడి ఐదు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ పక్కా భవనం లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్థలం కేటాయించి భవనం నిర్మించాలని కోరారు.