హైదరాబాద్లో భారీ రేషన్ బియ్యం కుంభకోణం గుట్టురట్టు చేసిన అధికారులు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

పేదల కోసం కేటాయించిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా సేకరించి పాలిష్ చేసి మార్కెట్లో అధిక ధరకు విక్రయిస్తున్న భారీ కుంభకోణాన్ని బయటపెట్టినట్లు సివిల్ సప్లయ్స్ విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్లోని కర్మన్ఘాట్ ప్రాంతంలో ఈ అక్రమ రవాణా జరుగుతున్నట్లు అందిన ఫిర్యాదుల మేరకు అధికారులు దాడులు నిర్వహించి నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అక్రమ మార్కెటింగ్ను పూర్తిగా అణచివేస్తామని అధికారులు స్పష్టం చేశారు.