కడప నుంచి రేణిగుంట వరకు నూతన గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం

రిపోర్టర్: గోపి స్థలం: Kadapa

కడప నుంచి రేణిగుంట వరకు సుమారు 122 కిలోమీటర్ల పొడవున రెండు వేల రెండు వందల యాభై నాలుగు కోట్ల అంచనా వ్యయంతో సరికొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం శరవేగంగా సాగుతోందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే తిరుమల శ్రీవారి భక్తులకు ప్రయాణ సౌలభ్యం కలగడంతో పాటు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని, వచ్చే రెండేళ్లలో పనులన్నింటినీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.