టూల్ బూట్లకు గుడ్ బై చెప్పనున్న కేంద్ర ప్రభుత్వం

రిపోర్టర్: నరేష్ స్థలం: తెలంగాణ

దేశంలోని జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద ఇకపై వాహనాలు ఆగాల్సిన పనిలేకుండా మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ విధానం త్వరలో అందుబాటులోకి రానుందని కేంద్ర అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పదకొండు టోల్ ప్లాజాలను ఎంపిక చేసి కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఫాస్టాగ్ లేదా నంబర్ ప్లేట్ ఆధారంగా ఆటోమేటిక్గా టోల్ ఫీజు కట్ అయ్యే ఈ అత్యాధునిక విధానం రాబోయే ఆరు నెలల్లో పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.