గ్రేటర్ ప్రజలపై పన్నుల మోత: ఆస్తి పన్ను ఏటా పది శాతం పెంపు
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్తగా అమల్లోకి తెచ్చిన క్యూర్ బిల్లు చట్టం ద్వారా ఆస్తి పన్ను భారం విపరీతంగా పెరగనున్నట్లు నమస్తే తెలంగాణ పేర్కొంది. ఇప్పటివరకు అమలులో ఉన్న యాన్యువల్ రెంటల్ వ్యాల్యూ స్థానంలో సబ్ రిజిస్ట్రార్ రేట్ల ఆధారంగా క్యాపిటల్ వ్యాల్యూ పద్ధతిని తీసుకువచ్చారు. దీనివల్ల ఏటా కనీసం పది శాతం మేర ప్రాపర్టీ ట్యాక్స్ అదనంగా పెంచుకుంటూ పోయేలా ప్రతిపాదించడంతో నగర వాసులు శాశ్వత పన్నుల చక్రబంధంలో చిక్కుకోనున్నారు.