విజయవాడలో పోలీసు సిబ్బందికి తొలి సైబర్ శిక్షణ పూర్తి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: ఎన్టీఆర్
సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా విజయవాడ సి-ఫోర్ కేంద్రంలో నిర్వహించిన తొలి సైత్రైన్ శిక్షణ విజయవంతంగా పూర్తయినట్లు విజయవాడ సిటీ పోలీస్ వెల్లడించారు. సైబర్ క్రైమ్ డిసిపి కృష్ణ ప్రసన్న పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పద్దెనిమిది మంది పోలీస్ అధికారులు మరియు సిబ్బంది శిక్షణ పొందారు. డిజిటల్ ఫోరెన్సిక్స్ మరియు ఆధునిక సాంకేతిక టూల్స్ వినియోగంపై వీరికి ప్రత్యేక అవగాహన కల్పించారు. ప్రజల డిజిటల్ భద్రతను మరింత బలోపేతం చేయడమే తమ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.