గ్రామీణాభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పవన్ కల్యాణ్ పిలుపు

రిపోర్టర్: వెంకట్ స్థలం: నెల్లూరు

గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలని, పనుల నాణ్యతను పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోరారు. ఉదయగిరిలో మంగళవారం పల్లెపండగ 3.0 కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే కూటమి పాలనలో పదింతలు ఎక్కువగా సిమెంటు రోడ్లు నిర్మించామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో డొంక రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ప్రత్యేక ప్రాధాన్యంతో పనులు చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.