ఎన్నికల సంఘం వైఖరిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిప్పులు
రిపోర్టర్: నరేష్
స్థలం: నిజామాబాద్
ఓటర్ల పేర్లను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిబంధనల పేరుతో పౌరులకు నోటీసులు జారీ చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రధాన ఎన్నికల అధికారి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ను పట్టించుకోకపోతే తక్షణమే అరెస్టు చేయాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.