ఖమ్మం జిల్లాలో భూ రీ-సర్వే పనులపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు

రిపోర్టర్: సురేష్ స్థలం: ఖమ్మం

భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు కచ్చితమైన రికార్డులను రూపొందించడం కోసం చేపట్టిన భూ రీ-సర్వేకు క్షేత్రస్థాయిలో ఉన్న భూమే ప్రామాణికమని District Collector Khammam స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా వైరా మండలం నరపునేనిపల్లి గ్రామంలో కొనసాగుతున్న సర్వే పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేస్తూ, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా రీ-సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.