టీవీఎస్ గ్రూప్లో కుటుంబ వివాదం: ఆర్థిక వాటాలపై స్పష్టత రాలేదన్న మల్లిక

రిపోర్టర్: సురేష్ స్థలం: చెన్నై

టీవీఎస్ మోటార్ కంపెనీ చైర్మన్ ఎమెరిటస్ వేణు శ్రీనివాసన్ కుటుంబంలో విభేదాలు కొనసాగుతున్నాయని, ఎలాంటి ఆర్థిక పరిష్కారం కుదరలేదని ఆయన భార్య మల్లిక శ్రీనివాసన్ మరియు కుమార్తె లక్ష్మి వేణు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం వారు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. యాజమాన్య పదవుల కేటాయింపు కాకుండా ఆర్థిక యాజమాన్యానికి సరైన గుర్తింపు దక్కాలనేదే తమ ప్రధాన డిమాండ్ అని వారు వెల్లడించారు. కుటుంబ సభ్యుల మధ్య పారదర్శక ఒప్పందం లోపించడం వలనే వివాదం ఇంకా ముగియలేదని వారు పేర్కొన్నారు.