సోషల్ మీడియా పోస్ట్ తో సంచలనం సృష్టించిన నటి అనుపమ పరమేశ్వరన్
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
సమాజంలో మనుషుల ప్రవర్తనలో కనిపిస్తున్న డబుల్ స్టాండర్డ్స్ తనను ఎంతగానో బాధిస్తున్నాయని ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆమె పెట్టిన తాజా భావోద్వేగపు పోస్ట్ సినీ వర్గాల్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో తాను చేస్తే తప్పుగా చూపించిన అవే పనులను ఇప్పుడు ఇతరులు బహిరంగంగా చేస్తున్నారని ఆమె ఎత్తిచూపారు. సమస్య మనం ఏం చేశామన్నది కాదని, ఎవరు చేశారన్నదే ముఖ్యం అని అనుపమ వాపోయారు.