అంతర్వేది తీరంలో కొట్టుకువచ్చిన కార్గో నౌక: ఇసుక దిబ్బల్లో చిక్కుకున్న వైనం

రిపోర్టర్: సురేష్ స్థలం: తూర్పు గోదావరి

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సంచలనం సృష్టించిన అర్నబ్ అతి తీవ్ర తుపాను కారణంగా సముద్రంలో పెను ప్రమాదం చోటుచేసుకుంది అని అధికారులు తెలిపారు. విశాఖపట్నం నుంచి సింగపూర్కు బయలుదేరిన భారీ కార్గో నౌక ఇంజిన్ వైఫల్యం వల్ల మార్గం తప్ప తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది తీర ప్రాంతానికి కొట్టుకువచ్చి ఇసుక దిబ్బల్లో చిక్కుకుపోయింది. నౌకలో భారీ మొత్తంలో సల్ఫర్ లోడు ఉన్నట్లు గుర్తించామని, సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.