శివడవలస పాఠశాల కమిటీ చైర్మన్గా చిల్ల సౌజన్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
రిపోర్టర్: GANESH BBL
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం శివడవలస ప్రభుత్వ పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్గా చిల్ల సౌజన్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరూ పోటీకి రాకపోవడంతో తెలుగుదేశం పార్టీ మద్దతుతో ఆమె ఈ విజయం సాధించారు. టీడీపీ నాయకులు శంబంగి శ్రీను, చప్ప సత్యరావు, బొద్దాన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ ఎన్నిక నిర్వహించారు. పాఠశాల సమగ్ర అభివృద్ధికి, విద్యార్థుల మెరుగైన విద్యా వసతుల కల్పనకు శ్రమిస్తానని సౌజన్య తెలిపారు. ఈ విజయంపై టీడీపీ శ్రేణులు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.