వైకాపాకు భారీ షాక్: సొంతగడ్డపై బొత్స సత్యనారాయణకు ఊహించని ఎదురుదెబ్బ
రిపోర్టర్: సతీష్
స్థలం: Vizianagaram
శాసన మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణకు సొంత నియోజకవర్గంలో భారీ ఎదురుదెబ్బ తగిలిందని మాజీ సర్పంచులు మంగళగిరి సుధారాణి, పచ్చిపిల్లి ప్రమీల తెలిపారు. చీపురుపల్లి, గరివిడి మేజర్ పంచాయతీల మాజీ సర్పంచులతో పాటు పలువురు వైకాపా నేతలు పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేశారని వారు వెల్లడించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని, త్వరలో తెదేపాలో చేరనున్నామని వారు స్పష్టం చేశారు.