ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుండా రాజన్న.. సీఎం చేతుల మీదుగా అవార్డు!

రిపోర్టర్: p.g. murthy స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కిష్టాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుండా రాజన్న రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సోమవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు.

పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచడం, పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడం, జాతీయ స్కాలర్షిప్లకు విద్యార్థులను ఎంపిక చేయడంలో ఆయన చూపిన ప్రతిభకు గాను ఈ పురస్కారం లభించింది. రాజన్నకు అవార్డు రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.