జనసేన అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే జయకృష్ణ
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: పాలకొండ
పాలకొండ నగర పంచాయతీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాల్గో వార్డులో స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పాల్గొని జనసేన అభ్యర్థి ఆనం శారదను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని, మంచి నాయకులను ఎన్నుకుంటేనే వార్డులు మరింత అభివృద్ధి చెందుతాయని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.