'దసరా సెలవులు అక్టోబర్ 10 నుంచి షురూ..': తెలంగాణ విద్యాశాఖ ప్రకటన
రిపోర్టర్: గోపి
స్థలం: తెలంగాణ
తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు విద్యాశాఖ దసరా సెలవులు మరియు ఎస్ఏ-1 పరీక్షల షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఎస్ఏ-1 పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు ముగిసిన వెంటనే అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 22వ తేదీ వరకు పాఠశాలలకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ఈ షెడ్యూల్ను గమనించి విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.