అయోధ్య రామాలయ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన జితేంద్ర మిశ్రా
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అయోధ్య
అయోధ్య రామాలయ తొలి సీఈవోగా బాధ్యతలు చేపట్టిన మాజీ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా, రామభక్తుల ఆశీస్సులు, మద్దతు తమకు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ట్రస్ట్ సభ్యులతో సమావేశమైన ఆయన, ఆలయ నిర్వహణపై త్వరలోనే కొత్త వ్యూహాలను అమలు చేస్తామని వెల్లడించారు. భక్తుల నమ్మకంతోనే ఆలయ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని, తనకు కొంత సమయం ఇవ్వాలని ఆయన కోరారు. శ్రీరాముడి ఆశీస్సులతోనే ఈ బాధ్యతలను స్వీకరిస్తున్నట్లు తెలిపారు.