పొంగులేటిపై ఈడీ దర్యాప్తు వేగవంతం చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
రిపోర్టర్: సతీష్
స్థలం: Hyderabad
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబసభ్యులపై జరిగిన ఈడీ సోదాలకు రెండేళ్లు పూర్తయినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేకపోవడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని Telugu Scribe వెల్లడించారు. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈడీ కార్యాలయానికి వెళ్లారని తెలిపారు. అయితే అధికారులు లోపలికి అనుమతించకపోవడంతో కార్యాలయం బయట నిరసన తెలిపినట్లు పేర్కొన్నారు. 650 కోట్ల రూపాయల టీడీఎస్ కుంభకోణానికి సంబంధించి దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని డిమాండ్ చేశారని తెలిపారు.