'గురుకులంలో ఇవేం ఘోరాలు..': వీణవంక బీసీ గురుకుల పాఠశాలలో వరుస వివాదాలు

రిపోర్టర్: సురేష్ స్థలం: కరీంనగర్

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ పరిధిలోని బోర్నపల్లి శివారులో కొనసాగుతున్న వీణవంక మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పర్యవేక్షణ లోపంతో సీసీ కెమెరాల అదృశ్యం, విద్యార్థులపై వేధింపులు, హాస్టల్‌లో మద్యం సేవించి అస్వస్థత, విద్యార్థులు గురుకులం నుంచి పరారవడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నాసిరకం భోజనం, తాగునీటి సమస్యలతో పాటు సిలబస్ పూర్తికాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.