స్వయం ఏపీ బ్రాండ్తో గ్లోబల్ మార్కెట్కు మహిళా ఉత్పత్తులు: సీఎం చంద్రబాబు

రిపోర్టర్: హరి స్థలం: విజయవాడ

డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్ కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడలో జరగనున్న జాతీయ సరస్ మేళాను విజయవంతం చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ నెల పదిహేనేళ్ల నుంచి ఫ్లిప్కార్ట్లో స్వయం ఏపీ బ్రాండ్తో ఉత్పత్తుల అమ్మకాలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.