డీఎస్సీ నియామకాల అక్రమాలపై సమగ్ర సీబీఐ విచారణ జరపాలి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఆముదాలవలస
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల వ్యవహారంలో కూటమి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి చింతాడ రవికుమార్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డీఎస్సీకి సంబంధించి రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోందని, టెట్ మరియు డీఎస్సీ పరీక్షలు రాయకుండా, అర్హతలు లేకపోయినా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కట్టబెట్టారనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు ప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.