సర్పంచులను అవమానిస్తే సహించేది లేదు: పరిగి ఎమ్మెల్యేపై కొప్పుల మహేశ్ రెడ్డి మండిపాటు

రిపోర్టర్: వెంకట్ స్థలం: పరిగి

పరిగి ఎమ్మెల్యే టి.రామ్మెహన్ రెడ్డి బీఆర్ఎస్ సర్పంచులను అవమానించడం కరెక్టు కాదని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పరిగిలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత సర్వసభ్య సమావేశాల్ లో సర్పంచులను అవమానిస్తూ అధికారులను ప్రశ్నిస్తుంటే తానే సమాధానం చెప్పడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు.