లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఐఎఫ్‌టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి డిమాండ్
రిపోర్టర్: రమేష్
స్థలం: గోదావరిఖని
కార్మికుల హక్కులను హరించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఐఎఫ్‌టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి టీ. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎన్టీపీసీ ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో నిర్వహించిన కాంట్రాక్టు కార్మికుల సంఘం జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్న ఈ కోడ్లకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.