ఏఐ ఫీచర్ల ఆలస్యంపై క్లాస్ యాక్షన్ కేసులో యాపిల్ భారీ సెటిల్‌మెంట్

రిపోర్టర్: నరేష్ స్థలం: అమెరికా

యాపిల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఫీచర్ల ప్రకటనలో జాప్యం జరగడంతో అమెరికాలో వినియోగదారులు దాఖలు చేసిన క్లాస్ యాక్షన్ కేసులో టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ 250 మిలియన్ డాలర్ల సెటిల్‌మెంట్‌కు అంగీకరించింది. జూన్ 10, 2024 నుంచి మార్చి 29, 2025 మధ్య అర్హత కలిగిన ఐఫోన్ మోడళ్లను కొనుగోలు చేసిన అమెరికన్ వినియోగదారులకు ఒక్కో పరికరానికి గరిష్ఠంగా 95 డాలర్ల వరకు పరిహారం అందే అవకాశం ఉంది.