ఉమెన్ ఏపీఎల్ టోర్నమెంట్‌లో అమరావతి ఈ-ఛాంపియన్స్ ఘన విజయం
రిపోర్టర్: రాము
స్థలం: అమరావతి
ఉమెన్ ఏపీఎల్ టోర్నమెంట్‌లో అమరావతి ఈ-ఛాంపియన్స్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన అమరావతి 3 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేయగా, ఛేదనలో రాయలసీమ జెన్ స్టార్స్ 9 వికెట్లకు 156 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. అమరావతి బౌలర్ పూజిత హ్యాట్రిక్ సాధించడంతో పాటు 4 వికెట్లు పడగొట్టి ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు.