ఢిల్లీలో కలకలం: బదిలీని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన ఏసీపీ సస్పెండ్
రిపోర్టర్: రమేష్
స్థలం: న్యూఢిల్లీ
ఢిల్లీ పోలీసు శాఖలో వివాదం ముదిరింది. బదిలీని వ్యతిరేకిస్తూ పోలీసు ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన ఏసీపీ మనస్వీ వశిష్టను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. లాయర్లను రివాల్వర్ తో బెదిరించారనే ఆరోపణలతో గతంలో ఆయనను బదిలీ చేశారు. ఆ ఉత్తర్వులను వెనక్ కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిబ్బంది నిరసన తెలపడం, హెడ్‌క్వార్టర్స్ లో ఆందోళనలో పాల్గొనడంతో ఉన్నతాధికారులు ఈ సస్పెన్షన్ వేటు వేశారు.