ఆసియా క్రీడల్లో రజతం సాధించిన నావ్రెమ్ రోషిబినకు అభినందనలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: నిజామాబాద్

ఆసియా క్రీడల మహిళల 60 కేజీల సాండా విభాగంలో రజత పతకం సాధించిన నావ్రెమ్ రోషిబిరా దేవిని ఎంపీ అరవింద్ ధర్మపురి అభినందించారు. వరుసగా మూడు ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన తొలి భారతీయ ఉషు అథ్లెట్‌గా ఆమె చారిత్రాత్మక విజయం సాధించారని కొనియాడారు. ఈ అపూర్వ విజయంతో దేశం గర్వపడేలా చేశారని ఆయన ప్రశంసించారు.