బ్యాంకు ఖాతాలు ఇతరులకు ఇవ్వవద్దంటూ అల్లూరి జిల్లా పోలీసుల హెచ్చరిక

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అల్లూరి సీతారామరాజు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. బ్యాంకు ఖాతాలను ఇతరులకు ఇవ్వడం ద్వారా చట్టపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, కాలువలు దాటవద్దని, అత్యవసరమైతే పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరారు.