మెటా తీరుపై సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: వెంకట్ స్థలం: India

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నిబంధనలు ఉల్లంఘించినట్లేనా అని మెటాను సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే నిలదీశారు. తమ ఇన్‌స్టాగ్రామ్ పోస్టులను మెటా పదేపదే తొలగించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్నా కావాలనే తొలగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి సెన్సార్‌షిప్ విధిస్తున్నారని, ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.