పండుగ రద్దీతో వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ పూర్తిగా కిక్కిరిసిపోయింది

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వరంగల్

వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ ఆదివారం ఉదయం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. సద్దుల బతుకమ్మ పండుగ మరియు సెలవు దినం కావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సొంతూళ్లకు పయనమయ్యారు. తీవ్ర రద్దీ నెలకొన్నప్పటికీ ఆర్టీసీ అధికారులు అదనపు సర్వీసులు ఏర్పాటు చేయలేదని ప్రయాణికులు తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు.